పుట:2015.372978.Andhra-Kavithva.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

నను, నందు ముఖ్యముగ లక్షణ గ్రంథపఠ నమువలనను, లభిం చుట యసంభవమనియును. పుట్టుకతోనే కవియై పుట్టవలయుఁ గాని వేఱువిధమునఁ గవి యగుట యరుదు. భావ మెప్పుడును జనాంతరసంస్కారబలమునఁ గవికీ వస్తుసందర్శనముఁ గావించిన నిమేషముననే లబ్ధమగును.

వాల్మీకికవిచరిత్రము.

ఈభావ మాదికవియగు వాల్మీ కిమహర్షి చరిత్ర వలనఁ బరిస్ఫుట మగుచున్నది. తమసా నదీతీరమునఁ గామమోహిత మయిన క్రౌంచమిథునమునందు నొకదానిని జంపిన వ్యాధునిఁ జూచి బాణనిహతమయిన గ్రౌంచమును గాంచి కరుణాపర వశుఁడయి యీ క్రింది విధమున వాల్మీకి దురాతుఁడగు నావ్యా ధుని శపించెను....

శ్లో. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమళ్శాశ్వతీస్సమాః,
యత్ంచమిథునా దేశమపధీః కామమోహితమ్.

జన్మాంతర సంస్కారమును జిత్తపరిపాకమును గలవాఁడగుటచే వాల్మీకికి వ్యాధ బాణనిహతమయిన గ్రౌంచదర్శనము రసోత్పాదకమయ్యెను. జనాంతరసంస్కారము గాకున్న వాల్మీకి కరుణకుఁ గారణము వేరెద్దియు లేదుగదా ! తానుమనుజుడు. హతమయినది క్రౌంచము. ఇరువురకును సంబంధ మంతఁగా లేదు. కాని జన్మాంతరలబ్దసంస్కారముగల వాల్మికి వ్యాధబాణ నిహతమయిన గ్రౌంచమును జూచిన తోడనే కరుణా రసపరవశు డయ్యెను. కరుణారసము నిశిత తై క్ష్ణ్యముతో నతని వశముఁ గొనెననుటకు శ్లోకరూపమున నతనిశోకము వెలువడు టయే తార్కాణము, ఎంత, భాపతైక్ష్ణ్యములేనిది. వాల్మీకి సం