పుట:2015.372978.Andhra-Kavithva.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

97


బంధము లేని క్రౌంచము విషయమయి తనలో జనించిన కరుణ సనాలలోచితముగ సద్యః కావ్యముగఁ బలుకఁగలిగియుండెను? కావున రసము జనించునపుడు తైక్ష్ణ్యము గలిగియుండి పిదప విభావాదికముచేఁ బోషింపంబడి స్థాయీభావముగఁ గవి యందుఁ దిరముగ బాతుకొనును,

రసస్వరూపము - విభావాదికములు. రసముయొక్క బాహ్యస్వరూపమును బ్రదర్శించును.

కావున రసమునకు జన్మకారణము సాక్షాత్కారలబ్ద నిశితతీక్ష్ణ భావానుభూతియే. ఇక రసముయొక్క.. స్వరూప మెట్టిది? రసమున కాత్తయును, జీవమును ననఁదగునది సాక్షా త్కారమును తద్ద్వారా జనించు భావానుభూతీయే! ఇక బాహ్యస్వరూపమును దత్సూచకములగు నంగోపాంగములును, నీవిభావానుభావాదులే యగునని మన మొప్పికొనినను జిక్కు లేదు. కాని, యీవిభావానుభావాదు లనంతవైవిధ్యము గలిగి యుండును.

లక్షణ గ్రంథములలోని విభావాదుల ప్రశంస యుదాహరణము మాత్రమే.

కావున లక్షణ గ్రంథములకుఁ జెప్పఁబడు విభావాను భావాదుల ప్రశంస యుదాహరణ మాత్ర మేకొని సంపూర్ణ నిర్వ చనముగాని, నిర్ణయముగాని కాజాలదు. మానవ ప్రకృతి యనంతవిధములఁ బ్రవర్తించును. అందుచే భావానుభూతియు సనంత వైవిధ్యముఁ గలిగియుండును. అందువలన భావాను భూతిని సూచించువవియు, దానికంతరము లసందగినవియు నగు

ఆంధ్ర కవిత్వ-7