పుట:2015.372978.Andhra-Kavithva.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

95

మిఱుమిట్లుఁగొల్పును. అనఁగా జనియించునపుడే రసము తైక్ష్ణ్యము గలిగియుండి స్థాయీభావ మనందగియుండును. కాని స్థాయీత్వముమాత్రము చిరానుభూతి వలనస్థిరీకరింపఁ బడఁదగిన దగుటచేఁ జివరకు సిద్ధించును. కాని మొట్ట మొదట, జనించు రసానుభవమున స్థాయీభావమున కుండవలసిన నిశిత లైక్ష్యము పూర్తిగ నుండును. మెఱుఁగువోలె మెఱసి యేఁగిస రసస్యరూపము కవి విభావాదికమును సాధనముగఁ గొని పునర్దర్శనముఁ గావించుటకుఁ బ్రయత్నించి రసోపలబ్దినిఁ బడసి " స్థాయీ భావము నందినవాఁడగును, అనఁగాఁ దొల్లింటి మెఱుంగుఁ బోలిన రసానుభూతిని బారిపోకుండ నెప్పుడుసు దన్నాశ్రయించుకొనియే యుండునటులు బంధించి కైపసముఁగావించి కొని పునఃపునా రసానుభూతి నొందుచు యోగబలమునఁ బరమేశ్వర రూపము నిత్యముఁ గాంచుచు నమేయానందము నందు యోగికరణి సిద్ధుఁడగును. కావున నింతవఱకుఁ జర్చించి తేల్చిన దేమనఁగా:-----

కవికి రససాక్షాత్కారము కావలెను.

రసానుభూతి సాటు, సాక్షాత్కారబలమున నిశీత తైక్ష్ణ్యము తో మొట్ట మొదట లబ్దమయి మననబలమున స్థాయీభావమునొందు ననియేకానీ సాక్షాత్కారబలము లేక విభావ అనుభావ సాత్విక వ్యభిచారీభావముల పట్టికలను జదివినంతమాత్రమునఁ గవికి రససిద్ది యసందగు స్థాయీభావ మేర్పడుట సంభవముగాదని యును గావ్యరచనకు మూలకారణమగు రసానుభవమును భావోద్రేకమును జన్మాంతరసంస్కార వాసనాబలమునను జిత్త సంస్కారము వలనను జనింపవలసిన దేశాని గ్రంథపఠనమువల