పుట:2015.372978.Andhra-Kavithva.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఆంధ్ర కవిత్వచరిత్రము .

ద్వితీయ

దర్శించినమూ ర్తిని ననుభవించినభావమును, వినినశబ్దమును గవి నెమ్మది మీఁదఁ గావ్య రూపమునఁ బరిణమింపఁ జేయుచు సాధనములుగా విభావాదుల నుపయోగించి రససిద్దిని బడయ నెంచును. కావున రసము ప్రప్రథమమున నే జన్మాంతర సంస్కార జనిత చిత్త పరిపొకము గలిగిన కవియొక్క దృష్టి వస్తువు పైని బ్రసరించిన తోడనే జనించును. పిట్టలు ప్రాతఃకాలమున గూండ్లు వదిలి పైరు చేలఁ దిరిగి మేఁత మేసి తటాకముల జలముఁ ద్రావి నానావిధ ఫలవృక్షములపండ్లను దిని సాయంకాలమగు సరికి గూండ్లు చేరునట్లుగనే, కవి సౌక్షాత్కా రలబ్ద మైనరసమును విభావాదికమునెడఁ బ్రసరింపనిచ్చి చివఱకు రసోపలబ్దిం బడయును. కవి యంత్యమున ననఁగాఁగావ్యాంతమునఁ'బడయు రసోపలబ్దికిని, మొట్ట మొదట రససాత్కార మగునపుడు కలుగు భావానుభూతికిని 'వైరుధ్ధ్యము లేదు. ఐక్య భావమే వర్తిల్లును. మొదట సాక్షాత్కార జనితమయిన భావము నిశిత తైక్ష్యము గలదీ యై జనించి యొక్క పెట్టునఁ బెల్లు వెల్లు వయుంబోలెను, మెఱుంగుఁబో లెను గవిని వశముఁ జేసికొని స్తంభతుని గావించి పారవశ్యావస్థను విడియించి యరుగును. పిమ్మట స్మృతిఁ దెలిసి కవి సొక్షాత్కారబలమునఁ దాఁ గాంచిన మూర్తి యిదియా యదియా! యనుచుఁ బ్రకృతియందుఁ గల వివిధమూర్తులతో సరిపోల్చి చూచి మననముఁ జేయుచు నట్లే కాగ్రచిత్తతతో మనసముఁ గావించుటవలన సంకల్ప సిద్ధుఁడై తొల్లింటి మహనీయమూర్తినిఁ దొల్లిఁటి యలౌకిక భావానుభూతిని బడయఁగలుగును. అదియే రససిద్ధి యనం దగును. కావున మామతమున రసము మొట్ట మొదట మెఱుపుల దీపయుం బోలే నిశితతీక్షతగల శాంతితో, జనించి కవికన్నుల