పుట:2015.372978.Andhra-Kavithva.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ఆంధ్ర కవిశ్వచరిత్రము

ద్వితీయ



కావున నేకాగ్రత నొందినభావమే వర్ణింపఁ బడవ లెనన్న గావ్యమున మితభాషణ మత్యవసరమగును. కవి చెప్పఁదలఁచుకొన్న భావమంతయు రెండుమూఁడు మాటలలోనో రెండుమూఁడు వాక్యములలోనో పూర్తియగును. 'గట్టె, కొట్టె, తెచ్చె' సన్నట్లగును. అదీగాక చిత్రములయందును, శిల్పములయం దును వర్ణశిల్పముల చే సూచితములగు భావములన్నియు నేక క్షణముననే గోచరించును. కావ్వమున భావము లొకదాని వెంబడి నొకటి గోచరించును. కావున నవి వివిథాంతరములు గల తీక్షతగలుగు వివిధావస్థలతోడఁ బ్రదర్శింపఁబడపలెను. వివిధాంతరములుగల తీక్షతగలుగు వివిథావస్థలును భావమునకు వైవిధ్యము నొసఁగును. అందుచే రసము నిశితతీక్షతతోడను, నేకాగ్రతతోడను మాత్రమే గాక వివిథావస్థలతోడను, 'వివిధాంతరములుగల తీక్షతతోడను బ్రదర్శితమగును. ఏక స్థాయిని బొడుచుండినచో నయ్యది 'కీచు రాయిరొదవలె వినువారికిఁ దలనొప్పిఁ బుట్టింపక మానదు. కావ్యమునకు నిట్లే రసము వైవిధ్యము లేక యేక స్థాయిని బ్రదర్శింపఁబడిన చో 'రోతయు, విసుఁగును జనింపకమానవనియు, నట్టివిసువును రోఁతయు జనింపకుండుటకై కవి సాత్విక వ్యభిచారాదిభావము లను విభావానుభావములను దగురీతిఁ బ్రస్తరించి కొవ్యమున రసమునకు వైవిధ్యమును నాహ్లాదకత్వమును గల్గింపవలెనని మనలాక్షణికులయభిప్రాయ మైయున్నది. ఎట్లయినను, గావ్యమున రసమనునది యే కారణమున జనించినను నిశిత తైక్ష్యముఁ గలిగి యుచ్చైస్థాయి నొందినయవస్థావి శేషమునకే చెల్లును గానీ తదితరములగు విభావానుభావాదికములకుఁ జెల్లదు.అందు వల్ల నే మనవారు స్థాయీభావమే రసమని చెప్పుటలో నెంతయు