పుట:2015.372978.Andhra-Kavithva.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసస్వరూపనిరూపణము,

93


రసస్వభావపరిచయము వ్యక్తమగుచున్నది. రసము నిశ్చయ ముగ విభావానుభావాదికములలో లేదని చెప్పఁదగదు. అవి రసోపలబ్దికిని రసప్రకటనమునకును సాధనమాత్రములుగను. మనలాక్షణికులు సూచించి యున్నారని మన మంగికరింపక, తప్పదు.

విభావాదికములు,రస ప్రకటనమునకును . - రసోపలబ్దికిని సాధనమాత్రము లే.

విభావానుభావాదికములు రసోపలబ్దికి నంతరములును సాధనములును మాత్రమే యనియుఁ గారణములు మాత్రము. కాజాలవనియు నిశ్చయముగఁ జెప్పవచ్చును.

రసముయొక్క జన్మ ప్రకారము. 'కవి ద్రష్ట'యనీ ' యంగీకరించు వారిమతము. రసము మొదట తీక్ష భావముగ జనించి విభావాదికముల పరామర్శ చేఁ దుదకు స్థాయీభావమునొందును.

ఇట్లు పలుకుటవలన నింకొక ప్రశ్నమున కవకాశ 'మొదవుచున్నది. రసము జనించునపుడు స్థాయీభావముగ జనించునా? లేక విభావాదికముబలమున స్థాయీభావముగఁ బరిణ మించునా? ఈ ప్రశ్నమునకుఁ బ్రత్యుత్తర "మొసఁగుటకుఁ గావ్య జన్మ కారణము నరయవలయు. కవి, మొట్ట మొదట భావము ననుభవించి పిమ్మట ప్రసరించునా? లేక భావాను భూతి నొందనివాఁడై ప్రస్తారములవలనఁ దుదకు భావోపలబ్దిని బడయునా? దీని విషయమున భిన్నా భిప్రాయముల కెడముగలదు. కవి సాక్షాద్ద్రష్టయని నమ్మువారికిఁ గవి ప్రప్రథమముననే భావమును దీక్షముగ ననుభవించునని నిశ్చయమగుచున్నది. అట్లు: