పుట:2015.370800.Shatakasanputamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     జ్ఞానప్రౌఢులఁ జేయుటన్ వెలయఁగా సర్వజ్ఞశబ్దంబు దా
     నీ నామాంకముగా విధించు నిగమానీకంబు సర్వేశ్వరా!11
మ. సురల న్మర్త్యసమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకో
     త్కరముంగా ఘను నల్పు నల్పుని ఘనుంగాఁ బుణ్యపాపాలిచేఁ
     దిరుగ న్వైచుచు నీ మహామహిమ ప్రీతిం బద్మజుండంబునం
     దరయన్ జీవుల నింద్రజాలములుగా నాడించు సర్వేశ్వరా!12
మ. ఘనుఁడై యేచి దశాననుండు బలిమిం గైలాసశైలేంద్ర మె
     త్తినఁ దద్దానవనాథుఁ ద్రొక్క నతఁ డర్థి న్మ్రొక్కినం గాచి ప్రా
     క్తనశౌర్యాధికుఁ జేసె దుష్టు నణఁపంగా శిష్టు రక్షింప రం
     జనతో నెప్పుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా!13
మ. తమకం బెత్తిన నాత్మజం గడు మదాంధవ్యాప్తి నేకాంతప
     క్షమునం దెవ్వరుఁ గానకుండఁ గవయంగాఁ బోయి నీ బాణఘా
     తమునం బద్మభవుండు ద్రెళ్లెననినం దాఁ దప్ప వర్తించి లో
     కమునం దెవ్వరికింక నిన్ను నెఱుఁగంగా వచ్చు సర్వేశ్వరా!14