పుట:2015.370800.Shatakasanputamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     పలఁ దద్బుద్బుదగర్భవాసులు హరిబ్రహ్మాది దేవాళియుం
     గలదే వారికి నీ మహత్త్వ మెఱుఁగంగా శక్తి సర్వేశ్వరా!7
మ. భవదున్మేషవిజృంభణంబు పరికింపంగా సరోజాతసం
     భవు జన్మంబు భవన్నిమేష మమితబ్రహ్మాండకల్పాంత భై
     రవసంక్షోభిత మన్నఁ దక్కిన భవత్ప్రారంభభూరిక్రియా
     నివహం బెవ్వరు నేర్తు రిట్టిదని వర్ణింపంగ సర్వేశ్వరా!8
మ. పవనుండై హిమధాముఁడై యనలుఁడై పానీయమై యాత్మయై
     రవియై యంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తిక్రియన్
     భువనాండంబులు లక్షణాంగములుగాఁ బుట్టించు నత్యద్భుతో
     త్సవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా!9
మ. జలజాతప్రభవాండభాండములు దుశ్చారిత్రులం బాత్రులం
     జెలువై యుండ యథాప్రమాణములుగా శిక్షింప రక్షింప ని
     శ్చలలీలం బ్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిఁ గాకింత వ
     ట్టెలమిం జేకొని నిర్వహింప మఱి రాజెవ్వండు సర్వేశ్వరా!10
శా. జ్ఞానజ్యోతి విజృంభమాణముగ నోజన్ విష్ణువిధ్యాది దే
     వానీకాత్మదశావళిం దవిలి నీవారంగ వారిం గళా