పుట:2015.370800.Shatakasanputamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. పలుజన్మంబులఁ గూడఁబడ్డ భవశుంభద్ఘోరదుష్కర్మరా
     సులు పైఁ గూలి సమస్తజీవులు వెసన్ శోషించుచు న్బెద్దదు
     ర్బలురై చిక్కిన దద్భవాపహరణార్థం బొప్పఁ బద్మోద్భవ
     ప్రళయం బొక్కొకమాటు సేయుదు తుదిన్ భావింప సర్వేశ్వరా!15
మ. సుమహత్పద్మభవాండపంక్తుల లయక్షోభప్రతాపంబుతో
     నిమిషార్థంబునఁ గ్రాఁచి పెంపెసఁగు నీ నేత్రానలజ్యోతి య
     య్యమమీనాంకజలంధరత్రిపురదైత్యాలి న్విజృంభించి భ
     స్మముగాఁ జేయుట నిశ్చయింప నిది దా శౌర్యంబె సర్వేశ్వరా!16
మ. అతిదక్షుండగు దక్షుఁ డీజగములో యాగంబు సల్లక్షణ
     స్థితిగాఁ జేయుచునుండి మిము మది నుద్దేశింపమిం జేసి తా
     హతుఁడయ్యెం దుది నట్టికార్యములుఁ బొందై యుండునే కర్తస
     మ్మతితో జేయని దుర్మదుండు మనునే భావింప సర్వేశ్వరా!17
మ. జగతీచక్రము పాదఘట్టనసదృశ్యంబై ప్రవర్తింపఁగా
     గగనంబంతయు బాహుమండలసమగ్రవ్యాప్తులం దద్భుతం
     బుగ ఘూర్ణిల్ల నజాంత్యవేళల సముద్భూతాంగహారావళుల్