పుట:2015.370800.Shatakasanputamu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

305


హరగతి మీఱఁ బల్కి తనయా విను నీ వేపుడో పురాణవై
ఖరు లెఱిఁగింతు వంచుఁ గుతుకంపడుతల్లినిఁ బోల రెవ్వరున్.

56


ఉ.

శ్రీలు చెలంగఁగాఁ జదువు చెప్పెడువేళఁ బరాకు మాని మ
బాలున కిప్డు విద్య బహుభంగుల నేర్పు మటంచు పెక్కుచం
దాల నొసంగు వస్తుసముదాయము నాథుఁ డెఱుంగనీక బ
ల్మాలిమి మీఱ నట్టిసుకుమారిని ద...

57


చ.

చదివితివేని నీ కిపుడు జామఫలంబులు దెచ్చియిత్తు స
మ్మదమున మంచిదోవతులు మాడ లొసంగుదు నంచుఁ బల్కి మే
ల్పొదలఁగ బుజ్జగించుచును బొంకముగా బడిఁ జేరఁ బంపి తాఁ
బదపడి త్రోవలో నిలుచుఁ బల్మఱుత...

58


చ.

చిఱుతను ద్రోవబాలకులు చిన్నతనంబునఁ గొట్టకుండ భూ
సురునకు దిట్టముం బఱుచుచో నిలు చేరను బ్రాద్దుపోవఁగా
నరయుచు బిడ్డఁ డాఁకొనియె నంచు మదిన్ దిగులొంది పిల్వఁగాఁ
బఱచుఁ దనంతటన్ బడికిఁ బల్మఱు త...

59


చ.

పెనఁకువ మీఱ భోజనము పెట్టు మటంచని రాఁ గుమారునిని
గని చిఱునవ్వు మోవిపయిఁ గ్రమ్మఁగ నీ విపు డేమి నేర్చితో