పుట:2015.370800.Shatakasanputamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

భక్తిరసశతకసంపుటము


బను లొనరింప నందఱును "బాలుడు యోగ్యుఁ" డటన్న మాటఁ దా
విని మది సంతసిల్లునలివేణినిఁ ద...

52


చ.

తినుకుచు బువ్వఁ బెట్టు మని తేపకుఁ బాతరలాడుఁ బెట్టినన్
గనుఁగొని పాలుపోయు మను గ్రక్కునఁ బోసిన “వెన్న గావలెం
జనని”యటంచుఁ దా నగడు జేసినఁ గోపము లేక తన్మనం
బనువడఁ జేసి సంతసిలునంగనఁ ద...

53


చ.

కలకొలఁదిం దనూజునకుఁ గా నొనరించినయట్టిభూషణం
బులు ధరియించుచో నెదుటఁ బుత్త్రునకుం దనదృష్టి తాఁకి మై
చెలువు దొలంగునో యనుచుఁ జేరువవారలమీఁద దృష్టి నె
క్కొలుపుచు సంతసిల్లు సుమకోమలిఁ ద...

54


చ.

అలసట వేసటల్ దలఁప కాఁకలిదప్పులమీఁదియాశ మై
తొలఁగుచు రాత్రులుం బగలు తోడిచెలు ల్మది మెచ్చఁ దత్తనూ
విలసనకార్యకర్మపదవిం బడి "భర్తృవినోద మింతకుం
గలదె” యటంచు సంతసిలుకామినిఁ ద...

55


చ్.

సరసవివేకము ల్దనరుజాడగలుంగను బిడ్డ నొక్కస
ద్గురునకు నొప్పగింపు మని కోరిక మీఱ నిజేశుతో మనో