పుట:2015.370800.Shatakasanputamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

భక్తిరసశతకసంపుటము


పల నలరారుచున్న యలభామినిఁ దల్లినిఁ బోల రెవ్వరున్.

36


ఉ.

ఇంతులఁ జూచి మీసుతుల కేపస రుగ్గిడినారు మీరు గో
రంత యెఱుంగం బల్కఁగదరమ్మ యటంచుఁ జికిత్స దోఁప నిం
తంతనరానియౌషధము లారయుచున్ గడుబ్రోచుచున్నధ
న్వంతరియో యనంగఁ జెలువారెడుత...

37


ఉ.

భావ మెలర్ప మూలికల భావన చేసినయట్టిబంగరుం
దీవెల నూకచిట్టుడుకు దీసి మరీచిఘృతోచితంబుగాఁ
ద్రావగఁ జేసి వేఁడి జలధారల మేను గడింగి నిద్దురం
బోవఁగ జోలఁ బాడుచును బొంగెడుత...

38


ఉ.

క్షీరము శర్మరాన్నమును జిక్కనిగట్టిపెరుంగు పాయసం
బారయ బొజ్జ నిండునటు లామెతగాఁ దినిపించి బిడ్డఁ డే
మో రహి లేక ముట్టఁడని మో మఱ వాంచుచు “ముద్దులయ్యగా
రార" యటంచుఁ బిల్చుచును రాజిలుత...

39


చ.

చిఱుతను జంకఁ బెట్టుకొని చిత్రముఁ జూపుచు వెండిగిన్నెలో
మెఱయుచు నున్న బువ్వఁ దినుమీ తినకున్నను బూచివాని వే

.