పుట:2015.370800.Shatakasanputamu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

301


గిర మిదె పిల్తు నంచు నళికించుచుఁ గాకికి వేతు నంఁచుఁ దా
బిరబిర చేతిముద్దఁ దీనిపించెడుత...

40


చ.

అరమర మానుచున్ గురుపదార్థము లెవ్వి భుజించితేని పా
లరుగవు బిడ్డ కంచు విహితాశనముం గబళించుచోఁ బరా
త్పరుని మునీంద్రు లట్లు సుతతత్పరదృష్టు లనంతపథ్యని
స్ఫురణఁ జెలంగుచున్న యిలసుందరిఁ ద...

41


ఉ.

ఆఁకొని పోరువెట్టునెడ నారయ నడ్డముగాఁ దనూజునిం
జేకొని క్రుచ్చి ముద్దిడుచుఁ జెక్కిలి దువ్వుచుఁ బాయి ద్రావరా
రా కనతండ్రి యంచని మనంబునం గుందుచు బొజ్జనిండ ర
క్షాకలితోక్తిఁ జన్గుడుపుకామినిఁ ద...

42


చ.

తడఁబడునట్లు ముంగిటను దప్పుటడుం గిడువేళ నజ్ఞతన్
బడు ననుచింతయు న్నడువఁ బాల్పడె నన్నకుతూహలంబుచే
డ్పడ నొకటైన మైమఱచి బాలునకున్ దనవ్రే లొసంగి నే
ర్పడరఁగ ద్రిప్పుచో శుభముఁ బల్కెడుతల్లినిఁ బోల రెవ్వరున్.

43


చ.

తనసరిబాలురం గలసి దవ్వుల కాటల కేగియున్నచో
దనయుఁ డిదేమొ లేఁ డనుచుఁ దత్తఱ మొందుచు నావ తాగిన