పుట:2015.370800.Shatakasanputamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

299


గను సమమొందఁగా నివిరి చక్కనివాఁ డగునట్లు చేయునే
ర్పున నలరారుచున్న ననబోణినిఁ ద...

32


చ.

పిడికిలి పట్టువేళఁ జనుఁ బేర్కొని నవ్వెడువేళ నోరలం
బడియెడువేళ నూకురులు పల్కెడివేళను దోఁగులాడుటన్
దడఁబడువేళఁ జూడఁగని తప్పుటడుం గిడువేళఁ బ్రేమ బల్
గడలుకొనంగ సంతసిలుకామీనిఁ ద...

33


ఉ.

బాలునివృద్ధికై యొరులుపల్కినయట్టుల నెంతద్రవ్యమై
నా లవమాత్ర మంచుఁ దననాథునకున్ దెలియంగఁ బల్కుచున్
లీల ఘటించి నందనునిలీలలకు న్మది సొక్కి యోగులం
బోలినయట్టు లుండు ననబోణినిఁ ద...

34


చ.

మన మతిప్రీతి నొంద నొకమంచిముహూర్తముఁ జూచినంతఁ దా
నను వమరంగ రంగలరువన్నము ముట్టఁగఁ జేసి బిడ్డఁ డిం
పెసయఁగ నాఁకఁటం బొదలి యెన్నఁడు బువ్వదినంగ నేర్చునో
యని మది నూహపాల్పడినయంగనఁ ద...

35


చ.

చెలు లుదకంబు దేరఁ దనచేతను నూనియఁ దోఁగ నంటుచోఁ
దల జలకంబు లార్చి బలుతాలిసితోఁ దడి యెత్తి మోమునన్
దిలకము చుక్కబొట్టువలె దీరిచి సంతసమంద నాత్మలో