పుట:2015.370800.Shatakasanputamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

293


చ.

పొరుగిరుగిండ్ల భామినులు పుత్రులు గల్గుట కాత్మతత్త్వసు
స్థిరమతిఁ జేయు సాధనముఁ జెప్పినయ ట్లుపవాసదేవతా
చరణయుగార్చనప్రభృతిసత్కృతు లెల్లను దానొనర్చుచోఁ
జిఱుతలమీఁదియాశ మదిఁ జేడ్పడుత...

8


చ.

తనయునిమీఁదిబాళి మదిఁ దాకినచో నుపవాస మీశ్వరా
ర్చనమును నోము లాది యగుసత్క్రియ లెల్లను జేయుచో నెదం
బెనఁగిన ప్రేమమై నొగిఁ దపింపఁగ నోర్చుచు సౌఖ్య మేమి నె
మ్మనమున నాస పాల్పడని మానినిఁ ద....

9


ఉ.

సేతువులో మునుంగు నతిశేముషి. దీనుల నన్నదానసం
ప్రీతులఁ జేయు దేవతలఁ బేర్కొను నైదువరాండ్ర కెల్లన
య్యే తనివారువాయనము లిచ్చుఁ బురాణము లాలకించుఁ దా
నేతఱి నోము నోఁచుఁ దనయేచ్ఛను దల్లినిఁ బోల రెవ్వరున్.

10


ఉ.

మోద మెలర్పఁగా దనయమోహముచేతను బిప్పలద్రునా
గాది ప్రతిష్ఠ లెల్ల జనులందఱు సంతసమందఁ జేయుచో
బేదఱికం బదెంత మఱి బిడ్డలు గల్గినఁ జాలు నంచు నా
పాదన జేయుచో నెపుడుఁ బల్కెడుత...

11