పుట:2015.370800.Shatakasanputamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

భక్తిరసశతకసంపుటము


ఉ.

బాలలఁ గూడి బొమ్మ నొడిపైఁ గడుఁ బ్రేమచెలంగ నిల్పి తా
నోలలు పాడుచున్ బొదలి యుగ్లిడి కేలను మేను దువ్వుచోఁ,
జాల మనంబుతో నిటులఁ జక్కనిపట్టిని గాన నెప్పుడో
కాల మటంచు నెంచు మదిఁ గల్గినతల్లినిఁ బోల రెవ్వరున్.

4


చ.

ఇలఁ గలదేవతాతతుల నెల్ల మనంబున నెంచి నామముల్
పలుమఱు నోటఁ బల్కుచును బార్వతిగేహముఁ జొచ్చి శాంభవీ
లలితకుమారసంభవఫలప్రదమైన వివాహ మింకఁ గా
వలెనని మ్రొక్కి వేఁడు సుతవాంఛకు ద...

5


చ.

చిలుకలు లేనిపంజరము శీతనుయూఖుఁడు లేనిరాత్రి చెం
గలువలు లేని పెంగొలను గాదెపరేహసుఖప్రదానని
ర్మలగుణశాలి నాఁ దగుకుమారకులం గనలేనిదాని మే
ల్చెలువ మ దేల యంచు మదిఁ జింతిలు త...

6


చ.

సుతులను గన్న యట్టి నెఱసుందరులం గని భాగ్యభోగసం
గతమతులార నందనులు గల్గుటకున్ దిట మార నేమినోఁ
చితిరొ తపంబు లేమి మఱి చేసితిరో యని పుత్రవాంఛలోఁ
గుతుక మెలర్పఁగా నడుగుకోమలిఁ ద...

7