పుట:2015.370800.Shatakasanputamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

భక్తిరసశతకసంపుటము


చ.

ఇలఁ బెఱవారినందనుల నెత్తుచు ముద్దిడుచోఁ బెనంగి య
న్నులఁ గని బిడ్డ లెన్నటికినో కన నోఁతు నటంచు బల్కి లే
మొలకమెఱుంగునవ్వులకు మోదము జెందుదు నిష్ట దైవమున్
దలఁచుచు బుత్త్రవాంఛ మతిఁ దాఁకినత...

12


చ.

తనయులబాళి మ్రుగ్గు లిడుఁ దాలిమి మీఱఁగ నెవ్వ రేమి చె
ప్పిన నది సేయుచుండు నిల వేల్పులకున్ మఱి మీఁదుగట్టు దా
ననయము గర్భహేతువివిధౌషధముల్ పచరించు ధర్మచిం
తన నొకకాలమైన మదిఁ దప్పనిత....

13


చ.

అనయము నందనేచ్ఛ హృదయంబున మల్లడిసేయ మీనలో
చన నిలయంబులో నిలిచి షణ్ముఖునిం జెలువారఁ గన్న యో
జననీ దయానిధీ సుతుల జయ్యన నిమ్మని నెమ్మి మీఱఁగా
మునుకొని సాగిలం బడుచు మ్రొక్కెడుత...

14


చ.

మునుకొని తాను బెద్దలకు మ్రొక్కిన వారును బ్రేమఁ బుత్రులం
గనుఁగొని సర్వకాలము సుఖంబున నుండుదు నీ వటంచు దీ
వన లిడునంతలోసన సువర్ణమహీధర మెక్కినట్లు నె
మ్మనమునఃఁ జాల సంతసిలుమానినిఁ ద...

15


చ.

ఎఱుకులసానిగద్దె విన నెంచుమనోరథ ముప్పతిల్లఁగాఁ