పుట:2015.370800.Shatakasanputamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బరమాత్మ చంద్రుఁడౌదువు
     నరులందున నృపతివౌదు నయముగఁ గృష్ణా!32
క. చుక్కల నెన్నఁగ వచ్చును
     గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్‌
     జొక్కపు నీ గుణజాలము
     నక్కజ మగు లెక్కపెట్ట నజునకుఁ గృష్ణా!33
క. కుక్షిని నఖిలజగంబుల
     నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమన్‌
     రక్షక వటపత్రముపై
     దక్షతఁ బవళించునట్టి ధన్యుఁడ కృష్ణా!34
క. విశ్వోత్పత్తికి బ్రహ్మవు
     విశ్వము రక్షింపఁ దలఁచి విష్ణుఁడ వనగా
     విశ్వము జెఱుపను హరుఁడవు
     విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా!35
క. అగణితవైభవ కేశవ
     నగధర వనమాలి యాది నారాయణ యో
     భగవంతుఁడ శ్రీమంతుఁడ
     జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా!36
క. మగమీనమవై జలనిధిని
     బగతుని సోమకునిఁ జంపి పద్మభవునకున్‌
     నిగమముల దెచ్చి యిచ్చితి
     సుగుణాకర మమ్ముఁ గరుణ జూడుము కృష్ణా!37