పుట:2015.370800.Shatakasanputamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. జయమును విజయున కియ్యవె
     హయముల ములుకోల మోపి యదలించి మహా
     రయమున రొప్పవె తేరును
     భయమున రిపుసేన విఱిగి పాఱఁగఁ గృష్ణా!27
క. దుర్జనులగు నృపసంఘము
     నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా
     దుర్జనులను వధియింపను
     నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా!28
క. శక్రసుతుఁ గాచుకొఱకై
     చక్రము చేపట్టి భీష్ముఁ జంపఁగ చను నీ
     విక్రమ మేమని పొగడుదు
     నక్రాగ్రహ సర్వలోక నాయక కృష్ణా!29
క. దివిజేంద్రసుతునిఁ జంపియు
     రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
     దివిజేంద్రసుతునిఁ గాచియు
     రవిసుతుఁ బరిమార్చితౌర రణమునఁ గృష్ణా!30
క. దుర్భర బాణము రాఁగా
     గర్భములోనుండి యభవ కావు మటన్నన్‌
     నిర్భరకృప రక్షించితి
     వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!31
క. గిరులందు మేరువౌదువు
     సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్‌