పుట:2015.370800.Shatakasanputamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవస్థలకు సాక్షి -యైనట్టి మూలంబు తాఁ దెలిసినఁ
జూడుమని సన్మార్గము -తేటగాఁ జూపుచును నారాయణా. 102
నీవు దేహంబు గావు -ప్రాణంబు నీవుగావింద్రియములు
నీవుగాదని తెలుపును -వేదాంత నిలయమున నారాయణా. 103
అనలతప్తంబు గాదు -జలమునను మునిఁగి తడిఁ జెందఁబోదు
అనిలశుల్కంబుగాదు -నిరుపమం బని తెలుపు నారాయణా. 104
కామహంకార మిపుడు -చిత్తంబుగా వీవు బుద్ధి నీవు
కావు మనసులు సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా. 105
దేహధర్మములు నీకుఁ -దోఁచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు -బోధించు ముఖ్యముగ నారాయణా. 106
ఎన్ని దేహములు చెడిన -నీవు చెడని యేక స్వరూపుఁడ వగుచు