పుట:2015.370800.Shatakasanputamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జెన్నలరి యుందు విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా. 107
అన్ని వేదాంత వాక్య -ములలో మహావాక్యములు నాలుగు
నిన్ను నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా. 108
ఉభయ దృశ్యోపాధులు, కడఁద్రోసిపోక యయ్యాత్మ మిగుల
నభయముగ నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా. 109
జీవ శివ తారతంయ -మున నైక్య సిద్ధి కానేర దనుచు
భావ సంశయము దీర్పు -కార్యార్థ పటిమచే నారాయణా. 110
నిర్వికారుఁడవు నీవు -నీ యందె నిజమైన చందమునను
బర్వుఁ బ్రకృతి వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా. 111
సద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముఁ జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా. 112