పుట:2015.370800.Shatakasanputamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థూలంబు నది యనుచును -బోధించు దయతోడ నారాయణా. 96
ఐదు నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు
ద్ధియుఁ, బాదుకొని సూక్ష్మ మందు -బోధించుఁ బ్రకటముగ నారాయణా. 97
గాఢమగు నజ్ఞానము -ఈరీతిఁ గారణ శరీర మగును
మూఢులకు వశముగాదు -తెలియ విను మోదమున నారాయణా. 98
ఈమూఁడు తనువులందు -దా నుండి ఈతనువు తాననుచును
వ్యామోహ పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా. 99
కలలేక నిద్రించును -కలఁగాంచి కడు మేలుగోరు చుండును
గలకాల మీ జీవుఁడు -త్రివిధములఁ గలసియును నారాయణా. 100
ప్రాజ్ఞతైజస విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుఁడు
ప్రజ్ఞగోల్పడ పొందును -సంసార బంధంబు నారాయణా. 101