పుట:2015.370800.Shatakasanputamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావ గోచరము చేయుఁ -జిత్స్వరూపములెల్ల నారాయణా. 85
ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణఁగు -నదె చూడు మని చూపు నారాయణా. 86
అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా. 87
అదె బ్రహ్మ మదె విష్ణువు -అదె రుద్రుఁ డదియె సర్వేశ్వరుండు
అది పరంజ్యోతి యనుచు -బోధించు విదితముగ నారాయణా. 88
భావింప వశముగాదు -ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట -నసి తాను బరమౌను నారాయణా. 89
అది మాయతోఁ గూడఁగ -శివుఁడాయె, నదియె విద్యను గూ
డఁగ విదితముగా జీవుఁడాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా. 90