పుట:2015.370800.Shatakasanputamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివుఁడు కారణ శరీరి -కార్యంబు జీవుఁడా లక్షణములు
ద్వివిధముగఁ దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా. 91
అరయ నిరువది నాలుగు -తత్త్వంబులై యుండు నందమ
గుచుఁ గరతలామలకముగను -బోధించుఁ బ్రకటముగ నారాయణా. 92
కారణము కార్యమగుచు -వ్యవహార కారణాఖ్యత నుండును
నారూఢి బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా. 93
ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు
నాల్గు, ఐదు విషయములు తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా. 94
స్థూల సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱఁగులకు
ను, నీలమగు నందు నమరు -నని తెలుపు లాలించి నారాయణా. 95
వెలసి పంచీకృతములు -నగు భూతములకుఁ బుట్టినది తనువు