పుట:2015.370800.Shatakasanputamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉల్లమునఁ గాపట్యము -లవ మైన నుండ నీయక సతతము
తల్లి దండ్రియుఁ దైవము -గురువనుచుఁ దలఁపవలె నారాయణా. 80
తనువు, ధనమును, సంపద -గురుని సొమ్మని సమర్పణము
చేసి, వెలసి తత్పరతంత్రుఁడై -నిత్యమును మెలఁగవలె నారాయణా. 81
ఏనిష్ఠ గురునిష్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు
మానసము దృఢము చేసి -యలరవలె మౌనియై నారాయణా. 82
ఇట్టి శిష్యుని పాత్రత -వీక్షించి హృదయమునఁ గారుణ్యము
నెట్టుకొని బ్రహ్మవిద్య -గురుఁడొసఁగు నెయ్యముగ నారాయణా. 83
బ్రహ్మంబు గలుఁగఁగానె -యేతత్ప్రపంచంబు గలిగి యుండు
బ్రహ్మంబు లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా. 84
ఈ విధంబున సూక్తుల -బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి