పుట:2015.370800.Shatakasanputamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గూడి, యొనరఁగా నాడులకును -నధిపతులు పరికింప నారాయణా. 52
పంచీకృతంబాయెను -భూతపంచకము, ప్రబలించి సృష్టి
పంచీకృతముచేతను -స్థూల రూపము లాయె నారాయణా. 53
పది యింద్రియముల మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు
గూడి, పదియేడు తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా. 54
స్థూలసూక్ష్మములు రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన
ము, లీల కారణ మాయెను -జీవులకు నాలోన నారాయణా. 55
ఈమూఁడు దేహములకు -విశ్వంబు నెల్లఁ బ్రకటనంబాయెను
నామ రూపముల చేత -లోకైక నాయకుఁడ నారాయణా. 56
కొన్ని మ్రానునఁ బుట్టును -గ్రుడ్లలోఁ గొన్ని తనువులు పుట్టును
గొన్ని ధరణిని బుట్టును -చమటలను గొన్ని హరి నారాయణా. 57