పుట:2015.370800.Shatakasanputamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాదృశ రజోగుణమున -జనియించె నరక కర్మేంద్రియములు
ఐదు తత్త్వమ్ము లగుచును -గర్మ నిష్ఠాదులకు నారాయణా. 47
వాక్పాణిపాదపాయూ -పస్థలను వాని పేళ్ళమరుచుండుఁ
బ్క్వహృదయులకుఁ దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా. 48
పలుకు పనులును నడుపును -మలమూత్రములు విడుచుటీ య
యిదును వెలయఁ గర్మేంద్రియముల -విషయములు నళినాక్ష నారాయణా. 49
పరఁగఁ జంద్రుండు బ్రహ్మ -క్షేత్రజ్ఞుఁ డరువొందు రుద్రుఁ
డచటి, పరమానసాదులకును -నధిపతులు వివరింప నారాయణా. 50
అరయ దిక్కున వాయువు -సూర్యుఁడును, వరుణుండు, నశ్విను
లును, బరఁగ శ్రోత్రాదులకును -నధిపతులు పరికింప నారాయణా. 51
అనలుఁ, డింద్రుఁడు, విష్ణువు -మృత్యువును, నల ప్రజాపతియుఁ