పుట:2015.370800.Shatakasanputamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ చతుర్విధ భూతములందుఁ -గడు హెచ్చు మానవ జన్మము
నీచమని చూడరాదు -తథ్యమే నిర్ణయము నారాయణా. 58
ఈ జన్మమందెకాని -ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేసేతఁ దను దెలియక -మానవుఁడు చెడిపోవు నారాయణా. 59
చేతనాచేతనములు -పుట్టుచును రోఁతలకు లోనగుచును
నాతంక పడుచుండును -గర్మములఁ జేతఁనుడు నారాయణా. 60
సకలయోనులఁ బుట్టుచుఁ -బలుమాఱు స్వర్గ నరకములఁ బడు
చు, నొకట నూఱట గానక -పరితాప మొందితిని నారాయణా. 61
వెలయ నెనుబదినాలుగు -లక్ష యోనులయందుఁ బుట్టిగిట్టి
యలసి మూర్ఛలఁ జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా. 62
క్రమముతో మనుజగర్భ -మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగుచును