పుట:2015.370800.Shatakasanputamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొంది భేదము నొందక -బ్రహ్మమై యుందువఁట నారాయణా. 30
కాలత్రయాబాధ్యమై -మఱి నిరాకారమై యుండు కతనఁ
జాలఁగాఁ దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తనుచు నారాయణా. 31
జ్ఞాన స్వరూపమునను -నజడమై జడ పదార్థము నెల్లను
గానఁగాఁ జేయు కతనఁ -జిత్తండ్రు ఘనులు నిను నారాయణా. 32
సుఖదుఃఖముల రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత విదులు -ఆనందమండ్రు నిను నారాయణా. 33
గుణ మొకటియైన లేని -నీయందు గుణమయంబైన మాయ
గణుతింపఁ గను పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా. 34
అందుఁ బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లఁ
జెందు నీశ్వరభావము -త్రిగుణసంశ్లిష్టమయి నారాయణా.35