పుట:2015.370800.Shatakasanputamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెట్టుకొని సకల జీవ -కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల -సేవించి రట్టయితి నారాయణా. 25
నేను పుట్టినది మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము
పూని యెప్పుడు సేయుదు -నీపదధ్యానంబు నారాయణా. 26
ప్రొద్దు వోవక యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని
బుద్ధిమాలిన చిత్తము -నీయందుఁ బొందదే నారాయణా. 27
ఎన్ని విధములఁ జూచిన -నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా. 28
లాభ లోభముల విడిచి -యిహపరంబులను ఫల మాసింపక
నీ భక్తులైన వారు -ధన్యులై నెగడెదరు నారాయణా. 29
ముందు నీ సృష్టి లేక -సచ్చిదానంద స్వరూపంబును