పుట:2015.370800.Shatakasanputamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్వంబు రజము తమము -నను మూఁడు సంజ్ఞలను గ్రమము
తోడఁ దత్త్వజ్ఞులేర్పరింపఁ -సద్గుణ త్రయములను నారాయణా. 36
ప్రకృతి నీయందు లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను
సకల ప్రపంచ మిటులఁ -గనుపట్టె నకళంక నారాయణా. 37
మీరు సంకల్పించిన -యిష్టప్రకారమును జెందు మాయ
యారూఢి వివరించెద -నవ్విధం బొప్పంగ నారాయణా. 38
పంచభూతములు మనసు -బుద్ధియును బ్రకటహంకారము
లును, నెంచంగ నిట్టిమాయ -యిదిగా ప్రపంచంబు నారాయణా. 39
భూతపంచక తత్త్వ సం -ఘాతమునఁ బుట్టె నంతఃకరణము
ఖ్యాతిగా నందుఁ దోఁచి -చిత్తు జీవాత్మాయె నారాయణా. 40
వెస మనో బుద్ధి చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము