పుట:2015.370800.Shatakasanputamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రచురింప నవి నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా. 41
భౌతిక రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను
వాద భేదములచేతఁ -బంచ పాపములాయె నారాయణా. 42
అలరు ప్రాణ మపానము -వ్యానంబుదానము సమానంబులు
తలఁప నీ సంజ్ఞలమరి -వాయుతత్త్వము లొప్పు నారాయణా. 43
ప్రత్యేక భూత సత్త్వగుణములన -బరఁగి బుద్ధీంద్రియములు
సత్త్వమున జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా. 44
చెవులు చర్మముఁ గన్నులు -జిహ్వ నాసికయుఁ బేరుల చేతను
దగిలి బుద్ధీంద్రియముల -విషయ సంతతిఁ దెలియు నారాయణా. 45
భౌతిక తమోగుణమున -విషయములు తఱుచుగాఁ జనియిం
చెను, శబ్ద స్పర్శ రూప -రస గంధ నామములు నారాయణా. 46