పుట:2015.370800.Shatakasanputamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     వా యొడయండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా!23
ఉ. స్వీకృత భక్తలోక! యవశీకృత కర్కశవావదూక! యూ
     రీకృత సద్వివేక! యురరీకృత జంగమభక్తి శూక! దూ
     రీకృత దుష్టపాక! యధరీకృత వేద విరుద్ధబౌద్ధ చా
     ర్వాక! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!24
ఉ. నిత్య యుదాత్తసత్య! యతినిశ్చల జంగమ భృత్య! సజ్జన
     స్తుత్య! కృపాకటాక్ష పరిశోభితచైత్య! మహిష్ఠ భక్తి సం
     గత్యభిరామ సత్య! గురుకార్య పరాయణకృత్య! వర్జిత
     వ్రాత్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!25
ఉ. ధన్య మహావదాన్య! గతదైన్య! విధూత జఘన్య! భక్తిచై
     తన్య! గుణైక్యమాన్య! హతదర్పక సైన్య! నిరస్త మాతృకా
     స్తన్య! జితారిఘోరభవజన్య! శరణ్యము చిత్సుఖాత్మ భా
     వన్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!26
ఉ. చర్వితశృంగిగర్వ! గుణసంపద ఖర్వ! యపూర్వగీతగాం
     ధర్వ! దిగంతపూర్ణ సముదాత్త యశః కృతకర్ణపర్వ! యం
     తర్వినివిష్టశర్వ! విదితస్ఫురణాంచిత [1]దర్వ! కావుమో
     పర్వఘనప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా!27

  1. దర్పకోటమా పర్వఘనప్రసాద, పర్వఘనమ్రపాద.