పుట:2015.370800.Shatakasanputamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. సాధిత జన్మబాధ! గతసర్వనిషేధ! [1]హతాపరాధ దు
     ర్బోధ కళావిరోధ! పరిపోషిత శాంభవవేధ! వర్జిత
     క్రోధ! నిరాకృతాఖిల విరోధ! శివైక్య సుబోధ! యీ భవ
     వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా!19
ఉ. శ్రీవిలసత్ప్రభావ! [2]ప్రవిశిష్ట పరాజిత యన్యదైవ! స
     ద్భావ! యుత స్వభావ! శివతత్త్వ విశిష్ట మహానుభావ! యం
     హోవనదావ! పాలిత మహోద్ధతశైవ! విభుండవీవ దే
     వా వరదానశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!20
ఉ. ఆద్య! సమర్పితాఖిల పురాతనభక్తగణానువేద్య! సం
     పాద్య! గుణానవద్య! యనుభావశివాంకిత గద్యపద్య! ని
     ర్భేద్య! గణైకవేద్య యురరీకృతవాద్య! భవాదిరోగ స
     ద్వైద్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!21
ఉ. నాద కళావినోద! యభినందిత వేదహృతాపవాద! సం
     పాదితభక్తిమోద! బుధవందితపాద! చిరప్రమోదనా
     స్వాదిత సుప్రసాద! యవిషాదశిలాద సుతావిభేద! దే
     వా దయఁ జూడుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!22
ఉ. కాయ గుణావిధేయ! జితకాయ! వినమ్ర జగన్నికాయ! యా
     మ్నాయవచోప్రమేయ! యసమాన సమంచితగేయ! భక్తి ధౌ
     రేయ! సదానపాయ! సుచరిత్రసహాయ! జితాంతకాయ! దే

  1. జితాన్యగాథ
  2. వ్రత