పుట:2015.370800.Shatakasanputamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఖ్యాత దయాభిజాత! విపదంబుధిపోత! యజాతతత్త్వ ని
     ర్ణేత! వినేత భక్తిపరిణేత! మనోరథదాత! జంగమ
     స్తోత! ముముక్షుగీత పరిశోభిత నీతిసమేత! సద్గుణ
     వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!28
ఉ. మారమదాపహార! సుకుమార శరీర! గణప్రసాద వి
     స్తార! వృషావతార సముదార విహార! [1]సమద్దయాపరి
     ష్కార! శుభప్రకార! యవికార! మహా జగదేకవీర! దు
     ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!29
ఉ. దేశిక జన్మదేశ! యవిదేశ యనావృతపాశ! సంహృత
     క్లేశ! మహాప్రకాశ! కృత కిల్బిషనాశ! దయానివేశ! నం
     దీశనికాశ! జంగమ సమీహితకారి గుణావకాశ! దే
     వా శరణీయవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!30
ఉ. ఉద్ధతభక్తవృద్ధ! వినుతోత్తమ సిద్ధపరీత జంగమ
     శ్రద్ధ! సదాత్మశుద్ధ! గుణరాజిసమృద్ధ! విముక్తపాశస
     న్నద్ధ! మహాప్రసిద్ధ యగుణ త్రయబద్ధ! శరణ్యమయ్య! భా
     స్వద్ధత చిత్ప్రబుద్ధ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!31
ఉ. నందితభక్తబృంద! యవినాశిరదాంశు ముఖారవింద! [2]సా
     నంద వినీతికంద! కరుణామకరంద! రసోపలాలిత

  1. సముద్దయా
  2. యానందవిలీయమానకరుణా