పుట:2015.370800.Shatakasanputamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ర్యావాణీస్తుత మోక్షలక్ష్మి? రఘువీరా! జానకీనాయకా!87
శా. త్రోవన్ మానవుఁ డొంటిఁబోవుతఱి నీస్తోత్రంబు వాక్రుచ్చినన్
     నీవుం దమ్ముఁడుఁ దోడువత్తురటె నీ నెయ్యంబు తియ్యంబుగా
     నీవంటాప్తుఁడు నిన్నుఁ బోలు హితుఁడున్ నీవంటి భక్తప్రియ
     ప్రావీణ్యుండును లేఁడు చూడ రఘువీరా! జానకీనాయకా!88
మ. నవనీతంబుల కేల పాఱెదవురా నాయన్న! రా! యెన్నరా
     యివి దూష్యంబులు గాఁగ గోపికలు? నీయింటం బదార్థంబు లె
     య్యవి లే? వంచు వచించు నమ్మకడ కొయ్యంజేరు కైశోర చో
     రవినోదంబులు నేఁ దలంతు రఘువీరా! జానకీనాయకా!89
మ. వివిధబ్రహ్మల యంత్యకాలముల నేవే నిల్వ వావేళలన్
     ధ్రువుఁడో యొండె విభీషణుండు బలి యుందుర్ వారు నీ దాసులై
     న విశేషంబునఁ గాక తక్కొరుల కుండంబోలునే యింద్రరు
     ద్రవిరించిస్తుత శౌర్యసార! రఘువీరా! జానకీనాయకా!90
మ. చెవి నీనామము విందునో యని కడున్ శంకించి కర్ణంబులన్
     రవము ల్మీఱఁగ ఘంట లంటనిడి ఘంటాకర్ణుఁ డేతేరఁగా
     నవి చూచిన్ వరమిచ్చినాఁడవఁట నీయంఘ్రిద్వయీసేవక
     ప్రవరుం గాచుట యేమిలెక్క? రఘువీరా! జానకీనాయకా!91