పుట:2015.370800.Shatakasanputamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినావందునో
     రవిసూనుం గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినావందునో
     యివి నీయందును రెండునుం గలవు; నీ కేదిష్ట మౌనో కదా
     రవివంశాగ్రణి! తెల్పవయ్య రఘువీరా! జానకీనాయకా!92
శా. దోసంబు ల్కులపర్వతంబుల కొలందుల్ గల్గినం గల్గనీ
     మీ సంకీర్తన శబ్దమాత్రమున భస్మీభూతమైపోవవా
     త్రాసు ల్కోటిసహస్రముల్ గలిగి యెత్తన్ రాని కార్పాసపున్
     రాసు ల్సోఁకిన నిప్పువోలె రఘువీరా! జానకీనాయకా!93
మ. కసుమాలంబగు దేహిపుట్టువుల నీ కష్టంబులం బాపి ది
     వ్యసుకాయం బొనరింతు వెవ్వఁడు నినున్ వాక్రుచ్చినన్ యోగిమా
     నస గేహంబులనుండి; లోహము సువర్ణచ్ఛాయగాఁ జేయఁగా
     రసవాదంబులు నేర్చితౌర రఘువీరా! జానకీనాయకా!94
మ. పసులం గాచిన గొల్లవాఁడవనుచున్ భావింతు నిన్నున్ దుదిన్
     ముసలిభ్రాత వటంచు నెంతు మదిలో మూర్తిత్రయాకార! నే
     వసుధాధారుని నిన్ను నిక్క మెఱుఁగన్ వాంఛింతు నో సత్కృపా
     రసపాథోనిధి! కావవయ్య రఘువీరా! జానకీనాయకా!95
మ. పిసిడిం జూచి మహాప్రదాతయనుచున్ బీభత్సకుత్సాంగునిన్