పుట:2015.370800.Shatakasanputamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బ్రసవాస్త్ర ప్రతిమానరూపుఁడనుచున్ బందం బ్రియంబంద శ
     త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబు గావించు నీ
     రసుఁడన్ నిన్ను నుతింపనేర రఘువీరా! జానకీనాయకా! 96. 96
మ. బహురూపాలు ధరించుకొంచును గ్రియాభాషాంగము ల్ముట్టఁగా
     బహుకాలంబులనుండి యాడితి నిఁకం బ్రాల్మాలినట్లయ్యెడిన్
     దహలంబెట్టక చాల్పురేయనుము నీత్యాగంబు నేనొల్ల సా
     గ్రహ దైతేయ మదాపహార! రఘువీరా! జానకీనాయకా!97
శా. మోక్షాపేక్ష జనించె నాకు నిదియేమో కాని యీజన్మమం
     దక్షీణోదయ!ముక్తి కెవ్వఁ డొడయం డాపుణ్యునిం జెప్పెదో
     దక్షారిస్తుత! నీవె కర్తవయినన్ దక్కేల నీవే ననున్
     రక్షింతో యెఱుగంగఁ జెప్పు రఘువీరా! జానకీనాయకా!98
మ. అక్షీణాప్రతిమానదానవిభవాహంకారపారీణ! యో
     రక్షోదైత్యమదాపహార విబుధా! త్రైలోక్యసంరక్షకా!
     దక్షధ్వంసివధూటికావినుత! నీ దాసానుదాసుండ నన్
     రక్షింపం గదవయ్య! రామ! రఘువీరా! జానకీనాయకా!99
మ. చదువు ల్దొంగిలి సోమకాసురుఁడు భాషాభర్త కూపెట్టఁగా
     నుదధుల్ సొచ్చినఁ బాఱిపట్టుటకు నుద్యోగించి మత్స్యంబవై