పుట:2015.370800.Shatakasanputamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ట్టలలోఁ జెట్టులలోన నంబువులఁ బుట్టం బుట్టఁగా నోపఁ గ
     ర్మలతాబంధము మాపవయ్య! రఘువీరా! జానకీనాయకా!83
మ. ఇల నీ మీఁదను జాలభక్తిగలవాఁ డేచెట్టవాఁడైన నే
     ఖలుఁడైనం దుది నుత్తమోత్తముఁడగున్ గాదన్నఁ గొంగీడ్చెదన్
     దెలుప న్నిల్చిన నాడుకొన్న పరవాదిన్ గెల్చెదన్ వేదశా
     స్త్ర లసద్వాక్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా!84
శా. దేవా! నాదొక విన్నపంబు గల దేదీ యంటివా వింటివా
     త్రోవం దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో
     యేవిఘ్నం బొనరించునో యెఱుఁగరా దే ముక్తికిం బోవుచో
     రావే వెంబడి నింతనంత రఘువీరా! జానకీనాయకా!85
శా. గోవం దొల్తటి జన్మకాలముల నీకుం బంటఁ గానైతి నం
     చీవక్రంబులె కాక నాకు నివి లక్షింపంగ జన్మంబులా
     చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై
     రావా నా మది కింకనైన రఘువీరా! జానకీనాయకా!86
శా. చావు ల్మర్త్యులకెల్లఁ గల్గుటలు నిస్సందేహముల్ దేహముల్
     చేవ ల్గల్గిననాఁడె శ్రీగిరి గయా శ్రీవేంకటాహోబిల
     గ్రావప్రాంతములందుఁ జేరవలెఁ; జేరంబోవ కేలబ్బు నా