పుట:2015.333901.Kridabhimanamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిద్దాంతముగాకుండ జేసిరిగదా! నే నెఱిగినంతలో లాక్షణికు లెవ్వరును క్రీడాభిరామపద్యములను వల్లభరాయనిపేర నుదాహరింపలేదు. ప్రబంధరత్నాకర మను పేర ప్రబంధపద్యములను సందానించిన పెదపాటి జగన్నాధకవి యొక్కడు మాత్రము (ఈతనిది లక్షణగ్రంధము గాదు) వల్లభరాయని పేర గ్రీడాభిరామ పద్యముల సేకరించినాడు. ఈ విషయమును నేను శృంగారశ్రీనాధమున స్పష్టముగా బేర్కొనియేయుంటిని. ఈ జగన్నాధకవి పెద్దనాదులకు దర్వాతి వాడు. ఆంధ్రచ్చందోలక్షణగ్రంధములలో లక్షణసారము, అధర్వణచ్చందము, ఉత్తమగండచ్చందము, గోకర్ణచ్చందము, కవిగజాంకుశము, కవిసర్పగారుడము, కవిలోక చింతామణి, కవిరాక్షసచ్చందము, నీలకంఠచ్చందము అనునవి నే నెఱింగినంతవఱకు బ్రాచీనములు. ఇందుగొన్ని శ్రీనాధునకు బూర్వమే వెలసినవి. స్థూలదృష్టి నిట్లు చెప్పుటగాని వీనికన్నింటికిని రచనాకాలము స్పష్టముగా నిర్ణయింప శక్యముగాకున్నది. ఇవియెల్ల నముద్రిరములు. ఇందు బెక్కింటియునిగూడ నెఱుగరాకున్నది. ఇందు కవిగజాంకుశము. కవిసర్పగారు డము, లక్షణసారము, కవిసర్వభౌమచ్చందము కవిలోకచింతామణి అనునవి మాత్రమే సమగ్రముగానో అసమగ్రముగానో దొరికినవి. వీనిలో నెందుగాని క్రీడాభిరామపద్యములు గానరావు.