పుట:2015.333901.Kridabhimanamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాధునికి జాల దర్వాతివారిలో చిత్రకవి పెద్దన, ముద్దరాజురామన, గణపవరపు వేంకటకవి యనువారి గ్రంధములు సర్వలక్షణసారసంగ్రహము,కవిసంజీవిని, ప్రయోగ రత్నాకరము అనునవి దొరికియున్నవి.

 ఆఱేండ్లక్రిందట  మైసూరుదొరతనపువారియెద్దనుండి కె.వి.లక్షణరావుగారు కొన్ని తెలుగు గ్రంధములను సాహిత్యపరిషత్తునకైకొనిరి.  చిత్రకవిపెద్దన సర్ఫలక్షణ సార సంగ్రహము, హరిభట్టు నృసింహపురాణము మొదలగునవి యని యాంధ్రసాహిత్యప్రిషద్భాండారమున  నిప్పుడున్నవి.  మైసూరనుండి రాగానే వాని నేను గడముట్ట బరిశీలించితిని.  వానిగూర్చి కొంత లఘుసూచిక వ్రాసికొంటిని.  చిత్రకవి పెద్దనకృతిలో క్రీడాభిరామపద్య్హమున్నట్టు నేను వ్రాసికొన్న సూచికలోగానరాదు.  అం దాపద్యములు లేవనియే నానమ్మిక. ముద్దరాజురామన గ్రంధమునను, గణపవరపువేంకటకవిగ్రంధముననుగూడ క్రీడాభిరామపద్యములువల్లభరాయని పేరనుదాహృతము లగుట నాకుగానరాలేదు.
     శ్రిధరచ్చంద మింతవరకు నా కెక్కడను గాన రాలేదు.  ప్రసిద్ధ గ్రంధాలయములం దెందును దాని  యునికి తెలియరాలెదు. రంగరాట్భందస్సు మొదలగులక్షణగ్రంధము లందు శ్రీధరచ్చందములోనివిగా నీ క్రిందిపద్యము లుదాహృతము లయ్యను.