పుట:2015.333901.Kridabhimanamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లాక్షణికోదాహృతులు

         క్రీడాభిరామము శ్రీనాధకృతమే యనుట కింతదాక బెక్కు సాధనముల జూపితిని.  కాని శృంగార శ్రీనాధముపై విమర్శము నెలయించిన విమర్శవిశారదులింక నొక యాక్షేపమును నిక్షేపించిరి.
       "అప్పకవి మొదలయిన యాధునికలాక్షణికు లొక రిద్దఱు క్రీడాభిరామమందలి పద్యములను శ్రీనాధుని వీధినాటకములోనివని యుదాహరించినను బూర్వలాక్షణికులు పలువురు - అందులో శ్రీనాధున కించుమించుగా సమకాలికులగు శ్రీధరాదులు కూడ ఈ గ్రంధమందలి పద్యములను వల్లభరాయని వీధినాటకములోని పనియే తమ లక్షణ గ్రంధములలో నుదాహరించియున్నారు.  ఈ విషయము శ్రీశాస్త్రిగారి సిద్ధాంతమునకు బ్రబ్నల బాధకముజ్గాగలదు.  శాస్త్రిగారీ సంగతిని పూర్తిగా విస్మరించి యిందుంగూర్చి యేమియును జర్చింపరయిరి. శ్రీనాధవల్లభరాయల దొంగతనమును గనిపెట్ట మనపాటి నైపుణ్యము వారికి లేకుండెనో ? పైవాక్యములు బూటకపు బూకరింపులబుంగలు: దుర్వివేకధురంధరములు. ఎట్లనగా: క్రీడాభిరామమందలి పద్య్హములను శ్రీనాధుని వీధినాకములోని వని యుదాహరించినవారు అప్పకవి. మొదలయినవా రొకరిద్దఱు గారు.  నలుగురైదుగురు.  అప్పకవీయము, లక్షణదీపిక, వీరరాజీయము,