పుట:2015.333901.Kridabhimanamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                                         ఇది శ్రీనాధకృతమే
దారువనవీధి శీతాంశుధరునిరంకు
శౌరిగొపాలభామినెచౌర్యకేళి
కామరసబావములు మించి కానబడగు
దెర్చి యిడుపులయందు జిత్రించినారు (నైషధము 7-150, 151)
'జారచోరమహాధూర్తచక్రవర్తి
దేవవేశ్యాభుజంగుండు తెలుగుభర్త ' (క్రీడా. 205 వ)
'జారచోరాధిధూర్తవిహారభూమి ' (నైషధము. 7-55)
'సంతతము దేవవేశ్యాభుజంగు డితడు ' (భీమ. 2-13)
'కోకిలము పంచమశ్రుతి గ్ఫొసరినట్లు
కనుమ యవ్వతిదేశంబుకరణకాంత.' (క్రీడా. 101 వ)
  ఒకదాని నొకటి రెట్టించుకొనుచు గోకిలములు కొసరి కొసరి కూయుట యిక్కడ వర్ణితము. ఇది శ్రీనాధసర్వగ్రంధసాధారణము.
  'సంజళంబున ధవళ ప్రబంధగీతి
  కనుక యవ్వలికర్ణాటకమలముఖులు.' (శివరాత్రి 2-54)
   ఈ 'కనుమయవ్వలికర్ణాటకమలముఖుల ' ప్రస్తావన మపూర్వమును ఇతరత్రాదృష్టమును; కనుకనే ముద్ర్రపకులర్ధము తొపకేమో వేఱుపాకమును సంస్కరించి చేర్చి దీని నధోజ్ఞాపికలో నుంచిరి.

గీ. హాహకుం లెక్కి విడిచినవారువంపు
    రొరమయునుబోలె రతికేళిమరము డిగ్గి