పుట:2015.333901.Kridabhimanamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలసభావంబుతోడ గర్ణాటవేశ్య
వచ్చుచున్నది యదె విప్రవర్య ! కంటె ! (క్రీడా. 87 వ)
'చండాలకులవరారోహ వాహకుం డెక్కి విడిచినవారువం
బునుబోలె సంభోగమునం దృప్తి చని ' (శివరాత్రి. 3-96)
'కద్రూమహదేవిగారావుసంతతి
మధుకైటభారాతిమడుగుబాన్పు ' (క్రీడా. 221 వ)
'ఏ యింతులకు బుట్టినిల్లు దుగ్ధాంబోధి
మధుకైటభరాతి మడుగుబాన్పు ' (కాశీ. 3-199)
ఈ క్రింది శివరాత్రిమహత్మ్యపద్యమున నితరకవ్య సాధారణము లగుపదములు గలవు.
చ.స్థితి చెడి మాంసభోజనము చేసి జనంగమవంశభామినీ
   రతి బరతంతుడైనపుదు బ్రత్యహమున్ ధరియించు చుండిన
   ప్పతితుడు గంగమట్తియయుబ్రన్ననునున్ననెనీరుకావిదో
   పతులును... ములు వంశ్యులయిండ్ల భుజించుకోరికన్ (శివరాత్రి. 3-1`12)
       'అలరుంబోడి జనంగమప్రమద ' 'గంగమట్టియతోడి పాద
గత్య మెడలిన ' 'ప్రన్ననిపట్టుతోరము ధరించి ' 'గన్నేరుబూ
చాయ కరమెప్ప నీర్కావిమడుగుదోవతి ' (క్రీడాభీరామము)
  'ప్రన్నని ' పదము శ్రీనాధుని సర్వగ్రంధములందు బహువారములు ప్రయుక్తమయ్యెను.