పుట:2015.333901.Kridabhimanamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‘అదె దారువనభూమి ‘ ఇత్యాది పద్యమున వర్ణితములయినకధలే మఱియు ‘తియ్యనింటిజోదు ‘ ఇత్యాది పద్యమునగల రతిమన్మధస్థితియే యీ హరవిలాసవచనమున గానవచ్చుచున్నవి. మఱియు నీఖృఏఏడాభిరామారంభ పద్యమున (3 వ) ‘మాలినీతీరనిర్మలసైకతములలో మేనకాప్సరసతో మేలమాడె ‘ నను విశ్వామిత్రప్రశంసాసీస చరణమును పయిహరవిలాసవచనగత విశ్వామిత్ర ప్రశంసయు ‘మాలినీతెరసైకతతో పదాంకితములుగా నుండుట బరికింప దగును. మఱియు బయి క్రీడాభిరామహరవిలాసచిత్రరచనావర్ణనా రీతులే శృంగారనైషధమునను సమానరీతితో గలవు.

తే.కోరగించినకడకంటికొలికి జూచి
   వాడినాలికపూదూవువంక తీర్పు
   చొరగి రతిదేవి పాలిండ్ల వొత్తిగిలిన
   యించువిలుకాని వ్రాసినా రిడుపునందు.
సీ. అమరవల్లభుడు గౌతముకూర్మియిల్లాలు
      జీకటితప్పు జేసినవిధంబు
   నితభాను డాచార్యుచిగురాకుతోబోడినై
      గన్ను వైచినకన్నెకలుపుమరులు
  నట్టేట దాశకన్యకకు నువ్విళులూరి
       జాలి బొందినరాశరునిరాశి
గారాపుగూతుపై గాగానిపని బూను
   వనజసభవుని నెమ్మనమువెలితి