పుట:2015.333901.Kridabhimanamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణిక ' అని కాశీఖండము(6-125) నను గలదు. కవిత్వరచనలో శ్రీనాధునిపదముల బట్టుకొనిన పాండురంగసుకవికృతి (3-179) లో గూడ నీపదము గలదు. ఈపద మితర కవుల కృతులలో నసాధారణము. ఇట్లే పాండురంగసుకవి యీ క్రీడాభిరామమందలి 'పుంజాలదండ 'ను గైకొన్నాడు.

'సవరా గ్రుత్తు గ్రొత్తపుంజాలదండ ' (క్రీడా. 93 వ)
'దండ సకిమెడ బుంజాలదండవెట్టు ' (పాండురంగమా. 3-62)
ఈపదమింక గళాపూర్ణోదయమున గూడ గలదు.

మఱియు గ్రీడాభిరామపు బయి 90 వ) పద్యమున 'పంచాస్త్రోపనిషద్రహన్యము,' గంధర్వోపనిషద్రహస్యములు వక్కాణింతురు ' ఇత్యాదిగా భీమఖండము (1-90) నను గలదు.

'చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు
విమలదంష్ట్రాప్రరోహములవాని '
ఇత్యాదిపద్యమీయుపోద్ఘాతమున నింతకుముందుదాహృత మయ్యెను.
సీ. సరివచ్చు ననవచ్చు శత్రమన్యువీటికి
     వివిధదేవాగారవిభ్రమమున
   బ్రతివచ్చు ననవచ్చు బాలమున్నీటికి
     నక్షయం బగు జీవాభివృద్ధి
  నెనవచ్చు ననవచ్చు నిందుబింబమునకు
     సకలకలావితానప్రవృద్ధి