పుట:2015.333901.Kridabhimanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరవచ్చు వనవచ్చు దోయజాక్షునిమూర్తి
   కభిరామలక్ష్మిననుగ్రహమహిమ (భీమ.1-106)

‘సరివచ్చు నన వచ్చు, ప్రతివచ్చు, ఎనవచ్చు
ననవచ్చు, దొరవచ్చు ననవచ్చు ‘అనునీపలుకుబళ్ళు శ్రీనాధుని
రచనలో దప్ప నాకిక నెక్కడను గానరాలేదు. నేటి
కొప్పవరపు గవీశ్వరులు మాత్రము జార్జి పట్టాభిషేకము
లలో గాబోలు నీపలుకుబళ్ళను మరల వాడినారు.

‘కమతావతారంబు గైకొన్నదై త్యారి
   కమనీగచరమభాగంబువోలె
వారియుగంబునం దావిర్బవించి అ
     జీచనాధదేవునిశిరమువోలె ‘ (క్రీడా.80వ)

‘ఆదికాలమున మాయావిలాసిని యైన
మురదైత్యదమమనిమూర్తివోలె
గామినీరూపంబు గైకొన్నశంబరా
    రాతికాలాయసాఅత్రంబువోలె ‘ (శివరాత్రి 8-81)

‘అదెదారువనభూమి ‘. (క్రీడా.191వ)
‘అదె భైరవస్థాన మటమీద నల్లదె ‘ (క్రీడా.149 వ)
 ఇత్యాదిపద్యములు రెండింటిని బోలుపద్యములు:
‘అదె సంవేద్యము కోటిపల్లి యదె ‘ -ఇత్యాది (భీమ.3-54)
‘అదె పట్టినస్తాన ‘-మిత్యాది. (భీమ.3-55)