పుట:2015.333901.Kridabhimanamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బరిశీలించి యీ విషయమును గూర్చి సత్యము వెల్లడింతురు గాకవి కోరుచున్నాడు

                         చేర్పులు, కూర్పులు
        పూర్వ ముద్రణముకన్న నీ ముద్రణము విషయవివరణములతో బరిశీలనమున కనుకూలముగా నుండవలె ననుతలంపుతో కొన్నిమార్పులను కూర్పులను అచ్చులోనికి దెచ్చితిని.  ఈ ముద్రణమును సాగించుసమయమున నేను ఓరుగల్లులో నుండిభాగ్యమున మిత్రులు సాయాయ్యమున నిందు పొందుపరచిన విశేషములు కూడ మరికొన్ని కలవు.  చిత్రపటములు సేకరించితిని.  ఓరుగల్లుకోట పునాదుల ప్రణాళీకను వ్రాయించితిని.  కధానాయకు లేయే ప్రాంతముల బర్యటించిరో పరిశీలించి యిందు గుర్తించుటకు యత్నించితిని. వానిలో నేడును దుర్గమున గుర్తింప దగిన ప్రదేశములు రెండుమూ డున్నవి.  1. కేశవస్వయంభూదేవాలయము. 2. మాచల్దేవి దిబ్బ. 3. వీరభద్రాలయము- ఇప్పుడీ యాలయము లేదుగాని బావిమాత్రమే సర్వే పటములలో గుర్తింపబడి యున్నది. 'వీరభద్రేశ్వరస్థానములు వెనుక నున్నట్లు పేర్కొనబడిన బొడ్డనబావి ' (చూ. 273 వ.) యిదియే యనుకొందును.  దుర్గమునందలి శిధిలములలో కాననైన నర్తకి శిలాప్రతిమకు చాయాపటమును సేక