పుట:2015.333901.Kridabhimanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామము శ్రీనాధకృతముగా దనువాదము పుట్టకుండుటకో యనునట్లు శ్రీనాధకవి యనేక స్థలముల నిందు దన తక్కిన గ్రంధ్ముల రచనలను జేర్చెను. ఆ పోలిక లీగ్రంధము శ్రీనాధకృతమే యని చెప్పక చెప్పుచున్నవి. ఇతర కవికృతులందలి సరస సంవిధానములను గాజేయు దొంగ కవులును గొంద ఱుందురు. వల్లభరాయ డట్టివాడై శ్రీనాధ రచనముల గొన్నింటిని గాజేసియుండరాదా యనరాదు. గ్రంధ మామూలాగ్రముగ శ్రీనాధరచనముగానే యనరాదు. గ్రంధ మామూలగ్రముగ శ్రీనాధతచనముగానే కంపట్టుచున్నది. తిస్కరకవుల స్ఫరచన మస్వరనమై పొందిపొసగక తెలియవచ్చుచుండును. క్రీడాభిరామమున బదసంవిధానము,, అవ్యయక్రమము, కారకప్రయోగవైచిత్రి, పద్యోపక్రమ నిర్వాహములు, ప్రతిపదము శ్రీనాధునివే రుగ్గడించుచున్నవి. శ్రీనాధుని రచనాచ్మత్కారముల నెఱిగినవారిది చక్కగా గుర్తింప గల్గుదురు. అదేపనిగా నరంభించినచో గ్రీడాభిరామమందలి ప్రతిపద్యమునందును శ్రీనాధుని రచనావైచిత్ర్యమును బోల్చి చూపనగును. ఆరంభమ్ందలిదే సీసపద్యపుటెత్తుగీతి:-

గీ. ఎవ్వ డాతండు సామాన్యఋషి యె తలప
   దాటకాకాళరాత్రికి దాశరధికి
   గాలకంధరకోదండఖండనునకు
   గార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. (క్రీడా. 2 వ)