పుట:2015.333901.Kridabhimanamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. ఉపమించెద ధారాధర
   తపనజ రై రాజ రాజ ధారానగరా
   ధిప ధారాధరవాహుల
   ద్రిపురాంతకవల్లభుని వితీర్ణిప్రౌడిన్ (క్రీడా.29 వ)

అని యున్నది. మఱియు గృత్యవసానపద్యమున గాలభైరవుడు కవీంద్రకాంక్షితత్రిదళమహీరుహ మగువల్లభతాయనికి సమగ్ర వైభవాభ్యుదయములు కృపసేయు నని యాశీర్వచన మున్నది. సూత్రధారోక్తిగాను భరతొక్తిగాను నయినను గ్రంధకర్తయగువా డిట్లు చెప్పుకొనుట సరసముగాదు. ఇది తానే తుమ్ముకొని, తానే శతాయుస్సని యనుకొన్నట్టున్నది. కవీంద్రకాంక్షితత్రిదశమహీరుహము గావున వల్లభరాయుడు విశేష ధన మొసగి కవియశ:కాంక్షియైయేతత్కృతికర్తృత్వమును దనపై వేయించు కొన్నాడని తలచుట ప్రమాణదూరముగాదు. అట్టి సంప్రదాయము గూడ నా కాలమున హెచ్చుగా గలదు.

శ్రీనాధుడు తన గ్రంధములలో గొన్ని పద్యములను, బద్యభాగములను, భావములను మార్పు చేయక యొతీరుననే కూర్చుకొనుచు వచ్చినాడు. స్వరచనమే యగుటచే సరిపడినపట్టులందు ముందు రచించిన గ్రంధముల లోని కూర్పులను జేర్చుకొనుట దోషము గాదు గదా! తిక్కనాదులు గూడ నిట్లు చేసిరి. ఎన్నంటికినిగూడ గ్రీడాభి